అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 75% వరకు భారీ డిస్కౌంట్!

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మ‌రో నూత‌న సేల్‌ను ప్రారంభించింది. మెగా ఎల‌క్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట ఈ సేల్‌ను మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 17, 2026) ప్రారంభించ‌గా, ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

February 17, 2026 5:04 PM
Amazon Mega Electronics Days sale offers on gadgets and laptops.
అమెజాన్ ఇండియాలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరిపోయే ఆఫర్లు. Photo Credit: Amazon India.

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon India) మ‌రో నూత‌న సేల్‌ను ప్రారంభించింది. మెగా ఎల‌క్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట ఈ సేల్‌ను మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 17, 2026) ప్రారంభించ‌గా, ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా హెడ్ ఫోన్స్‌, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, డెల్‌ (Dell), సోనీ (Sony), శాంసంగ్ (Samsung) వంటి ప‌లు ప్ర‌ముఖ బ్రాండ్ల‌కు చెందిన అనేక ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిండంతోపాటు అనేక ఆఫ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు. ఈ సేల్‌లో బెస్ట్ సెల్లింగ్ గ్యాడ్జెట్స్‌పై 75 శాతం వ‌ర‌కు త‌గ్గింపును పొంద‌వ‌చ్చ‌ని అమెజాన్ తెలిపింది.

ల్యాప్‌టాప్‌ల‌పై ల‌భిస్తున్న డీల్స్ ఇవే..

  • అల్టిమ‌స్ ఏపెక్స్ ప్రొ (ఇంటెల్ క్వాడ్ కోర్‌, 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌) ధ‌ర రూ.12,290గా ఉంది.
  • అసుస్ వివోబుక్ గో 14 (ఏఎండీ రైజెన్ 3 7320యు, 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌, 14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11, ఆఫీస్ హోమ్ 2024) ను రూ.34,650కి విక్ర‌యిస్తున్నారు.
  • హెచ్‌పీ 15 (ఏఎండీ రైజెన్ 3 7320యు, 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌) ల్యాప్ టాప్ ధ‌ర రూ.35,600గా ఉంది.
  • లెనోవో వి15 (ఇంటెల్ కోర్ ఐ3 13వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌, 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌, విండోస్ 11 హోమ్‌, ఆఫీస్ 2024, 15.6 ఇంచుల డిస్‌ప్లే) ల్యాప్ టాప్ ధ‌ర రూ.44,990గా ఉంది.
  • డెల్ జి-సిరీస్ 15-5530 (15.6 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5-13450హెచ్ఎక్స్, 16జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌) ల్యాప్ టాప్ ధ‌రను రూ.77,787గా నిర్ణ‌యించారు.

ఇవే కాకుండా ప‌లు ఏఐ ల్యాప్ టాప్‌ల‌ను సైతం ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు. హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ఓలెడ్‌, అసుస్ వివోబుక్ 14 స్మార్ట్ చాయిస్‌, లెనోవో యోగా స్లిమ్ 7, ఏస‌ర్ ఆస్ప‌యిర్ గో 14, డెల్ 14 వంటి ల్యాప్ టాప్‌ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఈ సేల్‌లో పొంద‌వ‌చ్చు.

ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై..

  • ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ బేసిక్స్‌, నాయిస్‌, బోల్ట్‌, జేబీఎల్‌, రియ‌ల్‌మి, వ‌న్ ప్ల‌స్‌, సోనీ వంటి కంపెనీల‌కు చెందిన ఇయ‌ర్ బ‌డ్స్‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు.
  • స్క‌ల్ క్యాండీ, నాయిస్‌, సెన్‌హెయిజ‌ర్‌, మార్ష‌ల్ వంటి కంపెనీల‌కు చెందిన హెడ్ ఫోన్స్‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.
  • వ‌న్ ప్ల‌స్‌, లెనోవో, శాంసంగ్ బ్రేవ్ కంపెనీల‌కు చెందిన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ల‌పై ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను ఈ సేల్ లో అందిస్తున్నారు.
  • బ్లూటూత్ స్పీక‌ర్లు, డిజిట‌ల్ కెమెరాలు, కెమెరా యాక్స‌సరీల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు.

బ్యాంకు ఆఫ‌ర్లు కూడా..

ఈ సేల్‌లో ప‌లు బ్యాంకు ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు.

  • హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ప‌ద్ధ‌తిలో 6 నెల‌లు లేదా ఆపైన కాల వ్య‌వ‌ధిలో ఆయా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.
  • ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల‌పై రూ.5,550 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.
  • హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల‌పై రూ.3,750 డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.
  • వ‌న్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల‌పై రూ.3500 డిస్కౌంట్ ఇస్తున్నారు.

గ‌మ‌నిక‌: ఆయా ఉత్ప‌త్తుల‌కు చెందిన ధ‌ర‌లు, ఆఫ‌ర్లు, రాయితీలు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి. క‌నుక వినియోగ‌దారులు అమెజాన్ లో సేల్ పేజీని సంద‌ర్శించి వివ‌రాల‌ను ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది. సేల్ తేదీ ఉన్నా స్టాక్ అయిపోయే వ‌ర‌కే ఆఫ‌ర్లను ఇస్తారు. క‌నుక ఆ విష‌యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment