Samantha : స‌మంత మోస‌గ‌త్తెనా ? అంత ప‌ని చేసిందా ?

October 3, 2021 2:00 PM

Samantha : సినీ ఇండ‌స్ట్రీలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్ద‌రూ విడిపోరు, వీరిపై వ‌స్తున్న‌వ‌న్నీ పుకార్లేన‌ని నిన్న‌టి వ‌ర‌కూ అభిమానులు అనుకున్నారు. కానీ వారి న‌మ్మకాన్ని వ‌మ్ము చేస్తూ ఇద్ద‌రూ విడిపోవాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే వీరి విడాకుల‌పై అనేక మంది సెల‌బ్రిటీలు ర‌క ర‌కాలుగా స్పందించారు. అలాగే స‌మంత మాజీ ప్రియుడిగా చెప్ప‌బ‌డుతున్న సిద్ధార్థ్ కూడా ఒక ట్వీట్ చేశాడు. అయితే అది క‌ల‌వ‌రం సృష్టిస్తోంది.

Samantha : స‌మంత మోస‌గ‌త్తెనా ? అంత ప‌ని చేసిందా ?

గ‌తంలో స‌మంత‌, సిద్ధార్థ్ ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారని, వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని, అందుక‌నే విడిపోయార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే నాగ‌చైత‌న్య‌, స‌మంతల విడాకుల నేప‌థ్యంలో సిద్ధార్థ్ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సిద్ధార్థ్ నిజానికి త‌న ట్వీట్‌లో ఎక్క‌డా స‌మంత పేరు ప్ర‌స్తావించ‌లేదు. కానీ ఆయ‌న చేసిన ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు స‌మంత‌పైనే అన్న అనుమానం క‌లుగుతోంది. తాను స్కూల్‌లో ఒక పాఠం నేర్చుకున్నాన‌ని.. మోస‌గాళ్లు ఎప్ప‌టికీ పైకి రాలేర‌ని, వారి బ‌తుకు అంతే న‌ని.. ప‌రోక్షంగా కామెంట్లు చేశాడు. అయితే అవి స‌మంత‌ను ఉద్దేశించి చేసిన‌వే అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఒక‌ప్పుడు స‌మంత, సిద్ధార్థ్ విడిపోయారు కనుక‌.. ఆ విష‌యంలో స‌మంత త‌ప్పే ఉంద‌ని, స‌మంత మోస‌గ‌త్తె అని భావిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడా ? అన్న అనుమానం కూడా క‌లుగుతోంది. అయితే దీనిపై వివ‌రాలు ఏమీ బ‌య‌ట‌కు రావు కానీ.. స‌మంత‌, చైతూ విడాకుల అనంత‌రం ఈ విధంగా సిద్ధార్థ్ ట్వీట్ చేయ‌డం మాత్రం చర్చ‌నీయాంశంగా మారింది. అత‌ను స‌మంత‌ను ఉద్దేశించే ట్వీట్ చేశాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now