Evaru Meelo Koteeshwarulu : భారీగా తగ్గిన ఎన్టీఆర్ షో రేటింగ్స్.. కారణం అదే..!

October 1, 2021 8:33 PM

Evaru Meelo Koteeshwarulu : బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున, చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. ఈ కార్యక్రమం గత కొన్ని వారాల నుంచి ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

Evaru Meelo Koteeshwarulu : భారీగా తగ్గిన ఎన్టీఆర్ షో రేటింగ్స్.. కారణం అదే..!

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ, ఆ తర్వాతి వారాలు క్రమక్రమంగా రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి. తాజాగా బుధవారం రేటింగ్స్ కూడా పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. అయితే నిర్వాహకులు ఊహించని విధంగా ఈ షో రేటింగ్స్‌ అమాంతం పడిపోయాయి. ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు.

తాజాగా 5వ వారం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అధికంగా వస్తాయని భావించిన నిర్వాహకులకు 4.70 రేటింగ్స్ రావడంతో ఒక్కసారిగా నిర్వాహకులు షాకయ్యారు. అసలు ఇలా ఉన్నఫలంగా రేటింగ్స్ పడిపోవడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ఐపీఎల్ సరిగ్గా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో రావడం చేత ఎంతో మంది ప్రేక్షకులు ఐపీఎల్ పై ఆసక్తి కనబరచడంతో అయిదవ వారం ఈ కార్యక్రమం రేటింగ్స్‌ అమాంతం పడిపోయాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now