Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

October 1, 2021 12:15 AM

Rashmika Mandanna Ad : సినీ ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు రావ‌డం క‌ష్ట‌మే. కానీ అవి వ‌చ్చాక మాత్రం వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేదు. డ‌బ్బు దానంత‌ట అదే వ‌స్తుంది. అయితే కొంద‌రు మాత్రం అలా వ‌చ్చిన పేరును, ప్ర‌తిష్ట‌ను చీప్ ట్రిక్స్ చేసి పోగొట్టుకుంటుంటారు. ప్ర‌ముఖ న‌టి ర‌ష్మిక మంద‌న్న కూడా ఇలాంటి జాబితాకే చెందుతుంద‌ని ఫ్యాన్స్ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే..

Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!
Rashmika Mandanna Ad

కంపెనీలు త‌మ బ్రాండ్స్ ను అమ్ముకోవ‌డం కోసం పెద్ద ఎత్తున యాడ్స్ ను ఇస్తుంటాయి. వాటిల్లో త‌మ అభిమాన తార‌లు ఉంటే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆ వ‌స్తువుల‌ను కొంటార‌ని కంపెనీలు కూడా సినీ తార‌ల‌తో యాడ్స్ చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. యాడ్స్‌ను తీయ‌డంలోనే అస‌లు కిటుకు ఉంటుంది.

Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!
Rashmika Mandanna Ad

సినిమా అయితే రెండున్న‌ర గంట‌ల పాటు స‌మ‌యం ఉంటుంది క‌నుక స్టోరీని ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌కు బాగా చెప్ప‌గ‌లుగుతాడు. కానీ యాడ్ అంటే 1 లేదా 2 నిమిషాల వ్య‌వ‌ధి ఉంటుంది. ఇంకా కొన్ని సంద‌ర్భాల్లో అయితే ఐపీఎల్ వంటి మ్యాచ్‌ల‌లో కేవ‌లం 10 సెక‌న్ల నిడివిలోనే యాడ్‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. క‌నుక ఆ స‌మ‌యంలోనే యాడ్ ఏమిటో ప్రేక్ష‌కుల‌కు అర్థం అయ్యేలా చెప్పాలి. దాంతో వాళ్ల‌ను క‌న్విన్స్ చేయాలి. అది వారి మ‌న‌స్సుల్లోకి వెళ్లాలి. అప్పుడే వారు ఆ యాడ్‌లో చూపించిన వ‌స్తువును కొనుగోలు చేసేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి. కానీ అంత త‌క్కువ వ్య‌వ‌ధిలో యాడ్ ఏమిటో చూపించాలంటే యాడ్‌ను తీసే ద‌ర్శ‌కుడికి నిజంగా క‌త్తి మీద సాము లాంటిదే అని చెప్ప‌వ‌చ్చు.

Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!
Rashmika Mandanna Ad

అయితే యాడ్‌ను త‌క్కువ స‌మ‌యంలో చూపించాలి అని చెప్పి అస‌భ్యంగా ఉండ‌కూడ‌దు. చీప్ ట్రిక్స్ ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. అలా చేస్తే పొగ‌డ్త‌ల క‌న్నా విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తాయి. స‌రిగ్గా ర‌ష్మిక మంద‌న్న కొత్త యాడ్‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. ఆమె న‌టించిన యాడ్ వ‌ల్ల ఆమెపై పొగ‌డ్త‌ల క‌న్నా విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. కార‌ణం.. అందులో ప్ర‌ద‌ర్శించిన చీప్ ట్రిక్సే అని చెప్ప‌వ‌చ్చు.

Rashmika Mandanna Ad : ఇంత పేరు ఉండి.. మ‌రీ ఆ యాడ్‌లో అలా చేయాలా ? ర‌ష్మిక‌పై ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!
Rashmika Mandanna Ad

ఒక యువ‌కుడు యోగా చేస్తూ, ఇత‌ర ప‌నులు చేస్తూ త‌న చేతుల‌ను పైకి ఎత్తితే ఆ స‌మ‌యంలో అత‌ని అండ‌ర్ వేర్ స్ట్రిప్స్ బ‌య‌ట‌కు క‌నిపిస్తాయి. వాటిపై ఆ అండ‌ర్ వేర్ లోగో ఉంటుంది. దాన్ని చూసి ర‌ష్మిక యోగా చేయించేదల్లా నంబ‌ర్లు కౌంట్ చేస్తూ ఆ అండ‌ర్‌వేర్‌ను చూడాల‌ని చెప్పి చాలా నెమ్మ‌దిగా నంబ‌ర్ల‌ను కౌంట్ చేస్తుంది. దీంతో ఆ యువ‌కుడు క‌ల‌గ‌జేసుకుని ఆమె కౌంటింగ్‌ను ముగిస్తాడు. ఈ యాడ్ ద్వారా ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో తెలియ‌దు కానీ.. జ‌నాల‌కు మాత్రం ఒక విష‌యం బాగా అర్ధ‌మైంది.

అబ్బాయిలు అండ‌ర్ వేర్ అలా ధ‌రిస్తే అమ్మాయిలు అలా చూస్తూ ప‌డిపోతార‌ని ఇందులో సారాంశంగా ప్రేక్ష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతోనే ర‌ష్మిక‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. ఒక ప్ర‌ముఖ న‌టి అయి ఉండి ఇలాంటి యాడ్స్‌లో ఎందుకు న‌టించాల్సి వ‌చ్చింద‌ని, న‌టించినా.. మ‌రీ అంత చీప్ ట్రిక్స్ ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ? ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. మ‌రి దీనికి ఆమె ఏమ‌ని స‌మాధానం ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now