Power Star : పవర్ స్టార్ కు హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం.. ఆందోళనలో అభిమానులు!

September 30, 2021 2:47 PM

Power Star : తమిళ యాక్టర్, డాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్ కు ఉన్నఫలంగా హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.

Power Star : పవర్ స్టార్ కు హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమం.. ఆందోళనలో అభిమానులు!
Power Star

తమిళ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీనివాసన్ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీకి లతిక అనే సినిమా ద్వారా అడుగు పెట్టారు. ఆ తరువాత ఎన్నో విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పవర్‌ స్టార్‌ ఒక కేసులో జైలు పాలయ్యారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీనివాసన్ తాజాగా పికప్ డ్రాప్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈయన తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నారని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now