ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చివరికి జైలు పాలయ్యాడు!

April 20, 2021 12:07 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కావాలి తారక మహేష్ అనే యువకుడికి హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన ఓ ట్రాన్స్ జెండర్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత మహేష్ తన సొంతూరులోనే ఉంటూ వారానికి ఒకసారి వచ్చి ఈమెను కలిసి వెళ్లేవాడు. మహేష్ విధంగా ఒక ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడనే విషయం తన ఇంటిలో తెలియడంతో అతని మందలించారు.

తల్లిదండ్రులు మందలించడంతో మహేష్ తన దగ్గరకు రావడం కూడా మానేశాడు. అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా మార్చడంతో తనకు అనుమానం వచ్చి ఏలూరుకి వెళ్ళింది.అక్కడ మహేష్ కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించడమే కాకుండా మహేష్ కూడా తనతో ఏ సంబంధం లేదని చెప్పడంతో మోసపోయానని భావించిన ఆమె ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎల్బీనగర్ పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన మహేష్ ఆమె మరింత కక్ష పెట్టుకొని ఫేక్ ఫేస్ బుక్ క్రియేట్ చేసి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం తో అసభ్యకర పదజాలంతో పోస్టులు, వీడియోలు పెడితూ ఆమెను విసిగించే వాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించగా ఆ వ్యక్తి మహేష్ అని తెలియగానే దానిపై మరోసారి కేసు నమోదుచేసి అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now