Srimukhi : యాంకర్ శ్రీముఖికి 4 పేజీల లేఖ రాసిన అభిమాని.. అది చూసి శ్రీముఖి రియాక్షన్..

September 29, 2021 5:07 PM

Srimukhi : బుల్లితెరపై పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Srimukhi : యాంకర్ శ్రీముఖికి 4 పేజీల లేఖ రాసిన అభిమాని.. అది చూసి శ్రీముఖి రియాక్షన్..
Srimukhi

ఈ క్రమంలోనే శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై తళుక్కుమంది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా శ్రీముఖికి మాత్రం ఎంతో పాపులారిటీ తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇక పోతే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖికి ఓ అభిమాని ఏకంగా 4 పేజీల లేఖను రాశాడు. అది కూడా అచ్చమైన తెలుగులో ఈ లేఖ రాసి ఆమెకు పంపించాడు.

ఈ లేఖలో శ్రీముఖి టాలెంట్ ను పొగుడుతూ రాయడమే కాకుండా తన జీవితంలో కీలకమైన మలుపులు, కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి ఆ అభిమాని రాసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని పేరు వెంకట్ అని మాత్రమే ఉంది, పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఈ విధంగా అభిమాని రాసిన లేఖను చదివిన శ్రీముఖి ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేస్తూ మీరెవరో నాకు తెలియదు కానీ.. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now