Post Office Scheme : పోస్టాఫీస్ స్కీమ్‌.. నెల‌కు రూ.2,475 పెన్ష‌న్ పొందండిలా..!

September 28, 2021 10:25 AM

Post Office Scheme : డ‌బ్బుల‌ను పొదుపు చేసే విష‌యానికి వ‌స్తే పోస్టాఫీస్ మ‌న‌కు అనేక ర‌కాల స్కీమ్‌ల‌ను అందిస్తోంది. ఈ స్కీమ్‌ల‌లో పెట్టిన డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది. పైగా ఎక్కువ మొత్తంలో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక పోస్టాఫీస్‌లో నెల నెలా రూ.3300 మేర పెన్ష‌న్ అందుకునే ప‌థకం కూడా ఒక‌టి అందుబాటులో ఉంది. ఎంఐఎస్ స్కీమ్ ద్వారా నెల నెలా పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు.

Post Office Scheme : పోస్టాఫీస్ స్కీమ్‌.. నెల‌కు రూ.2,475 పెన్ష‌న్ పొందండిలా..!
Post Office Scheme

పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా ఖాతాదారుల‌కు ఏడాదికి 6.6 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. నెల నెలా డ‌బ్బును పొంద‌వ‌చ్చు. ఇందులో గ‌రిష్టంగా రూ.4.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పొదుపు చేయ‌వ‌చ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9 ల‌క్ష‌ల మేర పొదుపు చేయ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టేందుకు మెచూరిటీ గ‌డువును 5 ఏళ్లుగా నిర్ణ‌యించారు.

ఈ ప‌థ‌కంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ల‌తో డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. మైన‌ర్ల‌కు అయితే త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్షకులు ఉండాలి. పిల్ల‌ల వ‌య‌స్సు 10 ఏళ్ల పైన ఉండాలి. క‌నీసం రూ.1000తో ప‌థ‌కాన్ని ప్రారంభించ‌వచ్చు.

ఈ ప‌థ‌కంలో రూ.50వేల పెట్టుబ‌డి పెడితే నెల‌కు రూ.275 చొప్పున ఏడాదికి రూ.3,300 వస్తాయి. 5 ఏళ్ల‌కు రూ.16,500 వ‌స్తాయి. రూ.1 ల‌క్ష పెడితే నెల‌కు రూ.550 చొప్పున ఏడాదికి రూ.6600 అవుతాయి. 5 ఏళ్ల‌లో రూ.33వేలు వ‌స్తాయి. అదే రూ.4.50 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెడితే నెల‌కు రూ.2475 పొంద‌వ‌చ్చు. ఏడాదికి రూ.29,700 అవుతాయి. 5 ఏళ్ల‌కు రూ.1,48,500 వ‌స్తాయి. ఈ విధంగా ఈ ప‌థ‌కంలో సుర‌క్షితంగా డ‌బ్బును పెట్టి క‌చ్చిత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment