Warangal : విషాదం.. మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదు అంటూ..

September 27, 2021 9:02 PM

Warangal : ఎన్నో అనారోగ్య సమస్యలతో మంచాన పడిన తల్లి.. ఆమెకు సేవలు చేస్తూ అలసిపోయిన తండ్రి.. తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..

Warangal : విషాదం.. మమ్మల్ని క్షమించండి.. మీకు భారం కాకూడదు అంటూ..

చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన నరిగే కొమురయ్య – ఐలమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఐలమ్మ పక్షవాతంతో మంచాన పడింది. నిత్యం తన భార్యకు ఆ భర్త సేవలు చేస్తూ ఎంతో అలసిపోయాడు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ వారు తమ పిల్లలకు భారం అవుతున్నారని భావించిన ఈ దంపతులు ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.

కొమురయ్య కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలిపి తను తాగి తన భార్యకు తాగించాడు. కూల్ డ్రింక్ తాగిన ఆ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు తన తల్లిదండ్రుల కోసం చూడగా తల్లిదండ్రులు లోపల తలుపులు వేసుకొని ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి తన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో కనిపించారు. వీరికి సరైన చికిత్స అందించడం కోసం వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఐలమ్మ పరిస్థితి కుదుటపడింది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now