samantha naga chaitanya : సమంత, నాగచైతన్య విడిపోతారని 3 సంవత్సరాల క్రితమే చెప్పాను: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

September 27, 2021 12:08 PM

samantha naga chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి నాగ చైతన్య, సమంత ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులను పెడుతూ ఇన్ డైరెక్ట్ గా తన మనసులోని మాటలను బయట పెడుతోంది.

samantha naga chaitanya సమంత, నాగచైతన్య విడిపోతారని 3 సంవత్సరాల క్రితమే చెప్పాను: ఆస్ట్రాలజర్ వేణు స్వామి
samantha naga chaitanya

ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్యల గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమంత, నాగ చైతన్య విడిపోతారని గతంలో నేను చెప్పాను. అప్పుడు అందరూ నా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను చెప్పినదే జరుగుతోంది..” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

samantha naga chaitanya

సమంత, నాగచైతన్యల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వారి జాతకాల పరంగా వారిద్దరూ కలిసి ఉండరని, సినిమాల పరంగా ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయే సూచనలు ఉన్నాయి.. అంటూ గతంలో వేణుస్వామి తెలియజేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అక్కినేని అఖిల్ కి కూడా వివాహం జరగదని చెప్పినట్టుగానే అతని వివాహం కూడా నిశ్చితార్థం తర్వాత ఆగిపోయిందని ఈ సందర్భంగా వేణుస్వామి తెలిపారు.

https://youtu.be/cYA3X0dtuLo

సమంత, నాగ చైతన్యల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వీరికి పెళ్లి జరిగినా ఫ్యూచర్ లో విడిపోతారని తాను చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతోందని తెలిపారు. ఎందుకంటే అమావాస్య రోజు పుట్టిన సమంతకితన వ్యక్తిగత విషయాలలో మనస్పర్ధలు రావడం వల్లనే విడిపోతుందని గతంలో వేణుస్వామి చెప్పినట్లు తెలిపారు. గతంలో ఈయన చెప్పిన ఆ విషయాలు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now