సరిగా కూర్చోమన్న పాపానికి.. ఇనుప రాడ్ తో టీచర్ పై దాడి చేసిన విద్యార్థి..

September 20, 2021 5:47 PM

టీచర్లు మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పుతూ మనల్ని సక్రమైన మార్గంలో పయనించేలా చేస్తారు. మనం ప్రస్తుతం ఒక గొప్ప డాక్టర్, ఇంజనీర్ వంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాము అంటే దాని వెనుక టీచర్ అనే వ్యక్తి ఉండడంతోనే మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాము. మనకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దే బాధ్యత వారికి ఉంటుంది. అలాంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నమే ఆ ఉపాధ్యాయుడు చేయగా ఆ ఉపాధ్యాయుడికి సదరు విద్యార్థి నుంచి చేదు అనుభవం ఎదురయింది.

సరిగా కూర్చోమన్న పాపానికి.. ఇనుప రాడ్ తో టీచర్ పై దాడి చేసిన విద్యార్థి..

ఢిల్లీలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఒక విద్యార్థి టీచర్ పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో చదివే లతీఫ్ అనే విద్యార్థి ఇప్పటికే రెండు సార్లు ఇంటర్ ఫెయిల్ అవడంతో మొదటి సంవత్సరంలోనే కూర్చుని చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్న సమయంలో లతీఫ్ తరగతి గదిలో ఇష్టానుసారంగా కూర్చోవడం వల్ల ఉపాధ్యాయుడు అతనికి సరిగ్గా కూర్చోమని చెప్పాడు.

ఉపాధ్యాయుడు తనకు ఈ విధంగా చెప్పడంతో లతీఫ్ ఎంతో ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న ఒక ఐరన్ రాడ్ తీసుకొని టీచర్ తలపై బాదాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లతీఫ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now