భార్య‌ను విదేశాల‌కు ఉద్యోగం కోసం పంపించి సెటిల్ కావ‌చ్చ‌ని అనుకున్న భ‌ర్త‌.. విదేశాల‌కు వెళ్లాక చీటింగ్ చేసిన భార్య‌..!

September 20, 2021 3:11 PM

పెళ్లి చేసుకున్నా అత‌ను భార్య‌ను రూ.ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి చ‌దివించాడు. వీసా, పాస్‌పోర్టు వంటి ప‌నుల‌కు కూడా ఎంతో మొత్తం ఖ‌ర్చు చేశాడు. చివ‌ర‌కు అత‌ను త‌న భార్య‌ను విదేశాల‌కు పంపాడు. కానీ ఆమె మాత్రం త‌న సోద‌రుల‌తో క‌లిసి భ‌ర్త‌ను మోసం చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

భార్య‌ను విదేశాల‌కు ఉద్యోగం కోసం పంపించి సెటిల్ కావ‌చ్చ‌ని అనుకున్న భ‌ర్త‌.. విదేశాల‌కు వెళ్లాక చీటింగ్ చేసిన భార్య‌..!

చండీగ‌ఢ్‌కు చెందిన మ‌న్‌వీర్ సింగ్ మండ్‌, అదే ప్రాంతానికి చెందిన గుర్‌క‌మ‌ల్ కౌర్‌ల‌కు 2019లో వివాహం జ‌రిగింది. గుర్ క‌మ‌ల్ కౌర్‌కు ప‌రంజిత్ సింగ్‌, పుష్పీంద‌ర్ సింగ్ అనే ఇద్ద‌రు సోద‌రులు, సురీంద‌ర్ కౌన్ అనే సోద‌రి ఉన్నారు. అయితే పెళ్ల‌య్యాక మ‌న్‌వీర్ సింగ్ త‌న భార్య‌ను బాగా చ‌దివించాడు. విదేశాల‌కు ఆమెను ఉద్యోగం కోసం పంపి కొంత‌కాలం గ‌డిచాక తాను కూడా అక్క‌డికి వెళ్లి స్థిర ప‌డ‌వ‌చ్చ‌ని అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అత‌న్ని మోసం చేసింది.

గుర్ క‌మ‌ల్ కౌర్ చ‌దువుతోపాటు వీసా, పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లు, ఇత‌ర ప‌నుల‌కు మ‌న్‌వీర్ సింగ్ ఎన్నో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాడు. చివ‌ర‌కు ఆమెను విదేశాల‌కు కూడా పంపాడు. కానీ ఆమె అక్క‌డికి వెళ్ల‌గానే మ‌న్‌వీర్ సింగ్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయ‌డం మానేసింది. దీంతో తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన మ‌న్‌వీర్ సింగ్ ఆమెతోపాటు ఆమె సోద‌రుల‌పై కేసు పెట్టాడు.

అయితే ఆమె సోద‌రులు మ‌న్‌వీర్‌తో రాజీ య‌త్నం చేశారు. రూ.15 ల‌క్ష‌లు ఇస్తామ‌ని మ‌న్ వీర్‌ను ఒప్పించారు. కానీ వారు రూ.7 ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చారు. దీంతో సంతృప్తి చెంద‌ని మ‌న్‌వీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను అరెస్టు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now