ఇన్ఫోసిస్‌లో మ‌ళ్లీ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌.. ప‌లు విభాగాల్లో ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..

September 19, 2021 10:38 PM

దేశంలో ఐటీ రంగంలో రెండో అతి పెద్ద సంస్థ‌గా ఉన్న ఇన్ఫోసిస్ ఇటీవ‌లే భారీ ఎత్తున గ్రాడ్యుయేట్ల కోసం కొత్త‌గా రిక్రూట్‌మెంట్‌ను చేప‌ట్టిన విష‌యం విదిత‌మే. మొత్తం 20వేల పోస్టుల భ‌ర్తీకి గాను ఇన్ఫోసిస్ నియామ‌క ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. అది కొన‌సాగుతోంది. అయితే తాజాగా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాల‌యాల్లో ప‌నిచేసేందుకు అవ‌స‌ర‌మైన నిపుణుల ఉద్యోగ‌ల కోసం ఇన్ఫోసిస్ మ‌ళ్లీ నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది.

ఇన్ఫోసిస్‌లో మ‌ళ్లీ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌.. ప‌లు విభాగాల్లో ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..

ఐటీ రంగంలో ప‌లు విభాగాల్లో కొన్నేళ్ల పాటు అనుభ‌వం ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ప్రిన్సిపాల్ ఆర్కిటెక్స్‌, జావా మైక్రో సర్వీసెస్‌లో స్పెష‌లిస్ట్ ప్రోగ్రామ‌ర్‌, టెక్నాల‌జీ అన‌లిస్ట్ – మెర్న్ స్టాక్‌, టెక్నాల‌జీ లీడ్ – రియాక్ట్ జేఎస్‌, క‌న్స‌ల్టెంట్ స్పెష‌లిస్ట్ ప్రోగ్రామ‌ర్ – బిగ్ డేటా, అజుర్ డెవ్ ఓపీఎస్ వంటి విభాగాల్లో ప‌నిచేసేందుకు ఆస‌క్తి ఉన్న, నిపుణులైన ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దేశంలో ఉన్న బెంగళూరు, కోయంబ‌త్తూర్‌, చెన్నై, భువ‌నేశ్వ‌ర్‌, ముంబైతోపాటు హైద‌రాబాద్‌లోనూ ఉద్యోగులు ప‌నిచేయాల్సి ఉంటుంది. కాగా మొత్తం ఎన్ని పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు అనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. కానీ ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఇన్ఫోసిస్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now