రూ.10 కోట్లకు అమ్ముడైన రూపాయి నాణెం..!

September 19, 2021 3:41 PM

సాధారణంగా చాలా మందికి పాత కాలానికి సంబంధించిన రూపాయి, పావలా, అర్థ పావలా నాణేలను భద్రపరచడం అలవాటుగా ఉంటుంది. ఇలా ఈ నాణేలను కొంతమంది అధిక ధరలకు అమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక రూపాయి నాణెం ఏకంగా 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ.10 కోట్లకు అమ్ముడైన రూపాయి నాణెం..!

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ విధమైనటువంటి నాణేల అమ్మకాలు అధికమయ్యాయి. ఈ విధంగా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఒక రూపాయి నాణెం ఆన్‌లైన్‌ అమ్మకాలలో ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత మొత్తంలో ఖరీదు చేసేంత ప్రాముఖ్యత ఆ రూపాయి నాణెంలో ఏముంది ? అంత ధర పలకడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలకు వస్తే..

రూ.10 కోట్ల విలువ చేసిన ఈ రూపాయి నాణెం ఇప్పటి కాలానిది కాదు. దీనిని 1885 లో భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో విడుదల చేశారు. ఈ రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండగా ఆ వ్యక్తి దానిని తాజాగా ఒక వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ రూపాయిని ఏకంగా ఒక వ్యక్తి రూ.10 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now