మహాలయ పక్షంలో మగవారు ఈ పనులను అస్సలు చేయకూడదు..!

September 19, 2021 10:24 PM

ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షంలో మనం మన చనిపోయిన పూర్వీకులకు, పెద్దవారికి పిండ ప్రదానాలను చేస్తూ వారి ఆత్మ శాంతించాలని వారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. మన పెద్దలకు ఎంతో పవిత్రంగా పూజలు చేసే ఈ రోజులలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి మహాలయపక్షంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!

మహాలయ పక్షంలో మగవారు ఈ పనులను అస్సలు చేయకూడదు..!

మహాలయ పక్షంలో మనం మన పెద్దవారికి పిండ ప్రదానాలు చేస్తాము కనుక ఈ 15 రోజులు ఏ విధమైనటువంటి శుభకార్యాలను జరపకూడదు. అదే విధంగా కొత్త వాహనాలను, కొత్త ఇంటిని కొనుగోలు చేయకూడదు. ఈ పదిహేను రోజులలో ఏ విధమైనటువంటి మాంసాహారాన్ని, ఉల్లిపాయ, వెల్లుల్లి కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా మహాలయ పక్షంలో ఉండే 15 రోజులను సంతాప దినాలుగా భావిస్తాము కనుక ఈ పదిహేను రోజులు మగవారు ఎలాంటి పరిస్థితులలో కూడా కటింగ్ చేయించుకోవడం, షేవింగ్ చేసుకోవడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటిలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా నియమాలను పాటించడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now