వీడియో వైరల్.. 45 సెకన్లలో కుప్పకూలిపోయిన 15 బిల్డింగులు.. ఎక్కడంటే..

September 19, 2021 12:23 PM

సాధారణంగా మనం ఒక ఇంటిని నిర్మించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకోవడమే కాకుండా, ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఆకాశాన్ని తాకే మేడలను నిర్మించాలంటే ఇంకెంత సమయం, డబ్బు ఖర్చు అవుతుందో మనం ఊహించుకోవచ్చు. ఈ విధంగా చైనాలో బిల్డింగులు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ బిల్డింగులను చూడాలంటే పూర్తిగా మన తలను పైకెత్తాల్సి ఉంటుంది. అలాం

వీడియో వైరల్.. 45 సెకన్లలో కుప్పకూలిపోయిన 15 బిల్డింగులు.. ఎక్కడంటే..టి ఎత్తయిన బిల్డింగులు కనురెప్పపాటు సమయంలో నేలమట్టం అయ్యాయి అంటే వినడానికి, చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది.

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 15 అత్యంత ఎత్తైన బిల్డింగులు కేవలం 45 సెకన్లలో నేలమట్టమయ్యాయి. అయితే అధికారులు ఈ భవనాలను ఎందుకు కూల్చివేశారన్న విషయం తెలియదు గానీ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బిల్డింగులను కూల్చడానికి అధికారులు ఎంతో పటిష్టమైన భద్రత చేపట్టారు.

ఈ బిల్డింగులను కూల్చడం కోసం ఏకంగా 4.6 టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. రెండు వేలకు పైగా రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది, 8 అత్యవసర రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచి సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఈ బిల్డింగులను కూల్చేశారు. ఈ బిల్డింగులను కూల్చడానికి గల కారణం ఏమిటనే విషయం తెలియక పోయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now