ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద డ్యాన్స్ చేసిన యువ‌తి.. మంచి ప‌ని చేద్దామ‌ని అలా చేసింది.. బెడిసికొట్టింది..

September 16, 2021 9:43 PM

స‌మాజంలో మంచి చేద్దామ‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ వారికి కొన్ని సంద‌ర్భాల్లో అనుకోని అవాంత‌రాలు ఎదుర‌వుతుంటాయి. ఇక కొంద‌రికైతే ఇబ్బందులు ఏర్ప‌డుతుంటాయి. తాజాగా ఓ యువ‌తికి కూడా ఇలాగే జ‌రిగింది. కోవిడ్ నేప‌థ్యంలో అంద‌రికీ మాస్కుల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆమె ఒక ప‌నిచేసింది. కానీ అది బెడిసికొట్టింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద డ్యాన్స్ చేసిన యువ‌తి.. మంచి ప‌ని చేద్దామ‌ని అలా చేసింది.. బెడిసికొట్టింది..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో బిజీగా ఉన్న రోడ్డు కూడ‌లిలో స‌డెన్ గా ఓ వైపు రెడ్ సిగ్న‌ల్ ప‌డింది. దీంతో ఓ యువ‌తి అక్క‌డ‌కు వ‌చ్చి జీబ్రా క్రాసింగ్ మీద డ్యాన్స్ లు చేయ‌డం మొద‌లు పెట్టింది. అయితే ఆమె ట్రాఫిక్ గైడ్‌గా అక్క‌డ ప‌నిచేస్తూ అంద‌రినీ అలా ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని అక్క‌డి వాహ‌న‌దారులు భావించారు. కానీ ఆమె అక్క‌డ డ్యాన్స్ చేసింది వేరే విష‌యం కోసం.

https://www.instagram.com/reel/CTtvxVhA1iA/?utm_source=ig_web_button_share_sheet

ఆమె పేరు శ్రేయా కాల్రా. క‌రోనా కార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధరించాల‌ని చాటి చెబుతూ ఆమె అలా ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద డ్యాన్స్ చేసింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిందంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె త‌రువాత ఇదే విష‌యంపై స్పందిస్తూ.. తాను ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, రెడ్ సిగ్న‌ల్ ప‌డి ఉన్న‌ప్పుడే డ్యాన్స్ చేశాన‌ని, గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ‌గానే త‌ప్పుకున్నాన‌ని తెలిపింది. మాస్కులను ధ‌రించాల‌ని అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోస‌మే అలా డ్యాన్స్ చేశాన‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ పోలీసులు మాత్రం సంతృప్తి చెంద‌లేదు. ఏది ఏమైనా ఆమె ఒక మంచి ప‌ని చేద్దామ‌ని ప్ర‌య‌త్నించింది. కానీ అది అలా బెడిసికొట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now