ఇద్ద‌రు పిల్ల‌ల ఖాతాల్లో రూ.906 కోట్లు జ‌మ అయ్యాయి.. మ‌ళ్లీ పొర‌పాటు చేసిన బ్యాంకు సిబ్బంది..?

September 16, 2021 5:05 PM

బీహార్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఖాతాలో ఇటీవ‌లే ఉత్త‌ర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్ వారు పొర‌పాటున రూ.5.50 లక్ష‌ల‌ను జ‌మ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఘ‌ట‌న మరువ‌క ముందే మళ్లీ అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అదే బ్యాంకులో చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా ఇద్ద‌రు పిల్ల‌ల ఖాతాల్లో రూ.96 కోట్లు జ‌మ అయ్యాయి. దీంతో వెంట‌నే అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు.

ఇద్ద‌రు పిల్ల‌ల ఖాతాల్లో రూ.96 కోట్లు జ‌మ అయ్యాయి.. మ‌ళ్లీ పొర‌పాటు చేసిన బ్యాంకు సిబ్బంది..?

బీహార్‌లోని క‌తిహార్ జిల్లాలో ఉన్న బ‌గ‌హురా పంచాయ‌తీ ప‌రిధిలోని ప‌స్తియా అనే గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్‌, గురుచ‌ర‌ణ్ బిశ్వాస్ అనే ఇద్ద‌రు విద్యార్థులు 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. వారికి ఉత్త‌ర్ బీహార్ గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయి. అయితే వారి ఖాతాల్లో కోట్ల రూపాయ‌ల డ‌బ్బు జ‌మ అయింది.

ఆశిష్ ఖాతాలో రూ.6,20,11,100 జ‌మ కాగా, గురుచ‌ర‌ణ్ ఖాతాలో రూ.900,52,21,223 జ‌మ అయ్యాయి. దీంతో వెంట‌నే పొర‌పాటును గ్ర‌హించిన బ్యాంకు అధికారులు డ‌బ్బును విత్‌డ్రా చేయ‌కుండా అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారు. డ‌బ్బులు ఎలా జ‌మ అయ్యాయన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. కానీ బ్యాంకులో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే ఇలా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now