వ్య‌క్తి అకౌంట్ లో పొర‌పాటున డ‌బ్బులు వేసిన బ్యాంకు సిబ్బంది.. తిరిగిచ్చేందుకు నిరాక‌రించిన వ్య‌క్తి.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

September 15, 2021 12:08 AM

బీహార్‌లోని ఖ‌గారియా జిల్లాలో వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి బ్యాంకు అకౌంట్‌లో ఆ బ్యాంక్ సిబ్బంది పొర‌పాటున కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను జ‌మ చేశారు. అయితే ఆ వ్య‌క్తి మాత్రం వాటిని ఇచ్చేందుకు నిరాక‌రించాడు. దీంతో పోలీసులు క‌ల‌గ‌జేసుకోక త‌ప్ప‌లేదు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

వ్య‌క్తి అకౌంట్ లో పొర‌పాటున డ‌బ్బులు వేసిన బ్యాంకు సిబ్బంది.. తిరిగిచ్చేందుకు నిరాక‌రించిన వ్య‌క్తి.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

బీహార్‌లోని ఖ‌గారియా జిల్లా భ‌క్తియార్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు అక్క‌డి గ్రామీణ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే అత‌ని అకౌంట్‌లో ఆ బ్యాంకు సిబ్బంది పొర‌పాటున రూ.5.50 ల‌క్ష‌ల‌ను వేశారు. దీంతో త‌ప్పు జ‌రిగింద‌ని తెలుసుకుని ఆ మొత్తాన్ని రిక‌వ‌రీ చేసేందుకు య‌త్నించారు. కానీ అప్ప‌టికే ఆ వ్య‌క్తి ఆ మొత్తాన్ని తీసి వాడుకున్నాడు.

బ్యాంకు వారు ఆ మొత్తం తిరిగి ఇవ్వాల‌ని, పొర‌పాటున ప‌డింద‌ని ఎంత చెప్పినా అత‌ను విన‌లేదు. ప్ర‌ధాని మోదీ ప్ర‌తి ఒక్క‌రి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 ల‌క్ష‌లు వేస్తార‌ని చెప్పార‌ని, అందులో భాగంగా మొదటి ఇన్‌స్టాల్ మెంట్ కింద ఆ మొత్తాన్ని వేశార‌ని అత‌ను బ్యాంకు వాళ్ల‌కు చెప్పాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రిక‌వ‌రీ చేసేలోగానే అత‌ను విత్‌డ్రా చేసేశాడు. అడిగితే ఖ‌ర్చు పెట్టాన‌న్నాడు. దీంతో పోలీసుల‌కు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయ‌గా.. వారు రంజిత్ దాస్‌ను అరెస్టు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “వ్య‌క్తి అకౌంట్ లో పొర‌పాటున డ‌బ్బులు వేసిన బ్యాంకు సిబ్బంది.. తిరిగిచ్చేందుకు నిరాక‌రించిన వ్య‌క్తి.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?”

Leave a Comment