కొత్త కారును కొనుగోలు చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

September 13, 2021 8:24 PM

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ ఇటీవ‌లే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ నూత‌న ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టిన విష‌యం విదిత‌మే. ఈ నెల 8వ తేదీన రామ్ చ‌ర‌ణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. అయితే రామ్ చ‌ర‌ణ్ తేజ కొత్తగా మెర్సిడెస్ కంపెనీకి చెందిన ఓ క‌స్ట‌మైజ్డ్ కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్ 600కు చెందిన క‌స్ట‌మైజ్డ్ వెర్ష‌న్ కారును రామ్ చ‌ర‌ణ్ కొన్నారు. దాని విలువ అక్ష‌రాలా రూ.4 కోట్లు.

కొత్త కారును కొనుగోలు చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ గ్యారేజ్‌లో ప‌లు కార్ల క‌లెక్ష‌న్ ఉంది. కార్లంటే ఎంతో ఇష్టం క‌నుక రామ్ చ‌ర‌ణ్ అనేక అద్భుత‌మైన కార్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఆస్ట‌న్ మార్టిన్ వి8 వాంటేజ్‌, రేంజ్ రోవ‌ర్ ఆటోబ‌యోగ్ర‌ఫీ, రోల్స్ రాయ్స్ ఫాంట‌మ్‌, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350ల‌తోపాటు ప‌లు ఇత‌ర విలాస‌వంత‌మైన కార్లు రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా కొన్న కారు వాటి స‌రస‌న చేరింది.

కాగా రామ్ చ‌ర‌ణ్ త‌దుపరి చిత్రం ఆర్ఆర్ఆర్‌లో క‌నిపించ‌నున్నారు. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ తో క‌లిసి చ‌ర‌ణ్ అందులో న‌టించ‌గా ఎస్ఎస్ రాజ‌మౌళి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో అజ‌య్ దేవ‌గ‌న్‌, ఆలియా భ‌ట్‌, శ్రియా శ‌ర‌న్ వంటి న‌టులు న‌టిస్తున్నారు. హాలీవుడ్ కు చెందిన రే స్టీవెన్స‌న్‌, ఆలిస‌న్ డూడీ, ఒలివియా మోరిస్‌లు కూడా ప‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీని అక్టోబ‌ర్ 13న ద‌స‌రా సంద‌ర్బంగా విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ అప్ప‌టికీ థియేట‌ర్లు చాలా వ‌ర‌కు తెరుచుకునే ప‌రిస్థితి లేదు. దీంతో సినిమా విడుద‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now