త్వ‌ర‌ప‌డండి.. ఐఫోన్ 12 మోడ‌ల్ ఫోన్ల ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించిన యాపిల్‌..!!

September 13, 2021 4:58 PM

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఐఫోన్ 13 మోడ‌ల్స్ ను లాంచ్ చేయ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే కొత్త ఐఫోన్ల‌ను విడుద‌ల చేసే ముందు యాపిల్ సంస్థ పాత ఐఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థ అలాగే చేసింది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు విడుద‌ల కానుండ‌డంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. దీంతో త‌గ్గిన ధ‌ర‌ల‌కే ప్ర‌స్తుతం ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

త్వ‌ర‌ప‌డండి.. ఐఫోన్ 12 మోడ‌ల్ ఫోన్ల ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించిన యాపిల్‌..!!

ఐఫోన్ 12 మినీకి చెందిన 64జీబీ, 128 జీబీ మోడ‌ల్స్ ధ‌ర‌లు రూ.69,900, రూ.74,900 ఉండ‌గా ఇప్పుడివి రూ.59,999, రూ.64,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అలాగే 256 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.84,900 ఉండ‌గా ఇప్పుడిది రూ.74,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

ఐఫోన్ 12 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా, రూ.66,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.84,900 నుంచి రూ.71,999 ధ‌ర‌కు త‌గ్గింది. 256 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.94,900 నుంచి రూ.81,999 కు త‌గ్గింది.

ఐఫోన్ 12 ప్రొ కు చెందిన 128 జీబీ మోడ‌ల్ రూ.1,15,900 కు ల‌భిస్తోంది. అలాగే 256 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,25,900గా ఉంది. అదేవిధంగా 512 జీబీ వేరియెంట ధ‌ఱ రూ.1,45,900గా ఉంది.

ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 128జీబీ, 256 జీబీ, 512జీబీ స్టోరేజ్ మోడ‌ల్స్ ధ‌ర‌లు వ‌రుస‌గా రూ.1,25,900, రూ.1,35,900, రూ.1,55,900గా ఉన్నాయి.

యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు ఎ14 బ‌యానిక్ చిప్ ను క‌లిగి ఉన్నాయి. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ల‌లో వెనుక వైపు 2 కెమెరాలు ఉండ‌గా, మ‌రో 12 మెగాపిక‌ల్స్ అల్ట్రా వైడ్ కెమెరాను క‌లిగి ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌లో వెనుక వైపు అద‌నంగా 12 మెగాపిక్స‌ల్ టెలిఫోటో కెమెరా ఉంది. వీటిల్లో 5జి ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now