శుభ‌వార్త‌.. డిగ్రీ చ‌దివిన వారికి ఐబీఎం సంస్థ‌లో ఉద్యోగాలు..!!

September 13, 2021 3:55 PM

ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ మెషిన్ (ఐబీఎం) సంస్థ భార‌త్‌లో గ్రాడ్యుయేట్ల‌కు ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. అసోసియేట్ సిస్ట‌మ్ ఇంజినీర్ పోస్టుకు గాను భారత్‌లోని పలు ప్ర‌దేశాల్లో అర్హులైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో ఎంపికైన వారు ముంబై, పూణె, ఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై న‌గ‌రాల్లోని ఐబీఎం క్యాంప‌స్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

శుభ‌వార్త‌.. ఐబీఎం సంస్థ‌లో డిగ్రీ చ‌దివిన వారికి ఉద్యోగాలు..!!

తాజాగా గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. వారిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా తీసుకుంటారు. అప్లికేష‌న్ డిజైన్‌, రైటింగ్‌, టెస్టింగ్‌, డిబ‌గ్గింగ్ కోడ్స్ వంటి అంశాల్లో వారు ప‌నిచేయాల్సి ఉంటుంది.

అభ్య‌ర్థుల‌కు జావా, పైథాన్‌, నోడ్‌.జేఎస్‌ల‌లో ప్రావీణ్యం ఉండాలి. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్‌ల‌ను అర్థం చేసుకోవాలి. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌వారు కూడా ఈ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసేవారు డిగ్రీ లేదా పీజీలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివి ఉండాలి. బీఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ, ఎంసీఏల‌లో కంప్యూట‌ర్స్ లేదా ఐటీ చ‌దివి ఉండాలి. అలాగే వారికి డిగ్రీలో 6 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గా సీజీపీఏను క‌లిగి ఉండాలి.

ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల‌కు అద్భుత‌మైన స్పోకెన్ స్కిల్స్ ను క‌లిగి ఉండాలి. అలాగే ఇంట‌ర్ పర్స‌న‌ల్ స్కిల్స్ ను కూడా క‌లిగి ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు ఐబీఎం అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “శుభ‌వార్త‌.. డిగ్రీ చ‌దివిన వారికి ఐబీఎం సంస్థ‌లో ఉద్యోగాలు..!!”

Leave a Comment