అందరి దృష్టిని ఆకట్టుకున్న ఇలియానా లాకెట్.. దాని ప్రత్యేకత ఏమిటంటే?

April 16, 2021 1:39 PM

గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. తన అందచందాలతో, ఎంతమంది కుర్ర కారులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో తన విలువైన సమయాన్ని గడుపుతూ, మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇలియానా తాజాగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇలియానా మెడలో ధరించిన స్పెషల్ లాకెట్ పై నెటిజన్లు దృష్టిసారించారు.

ఈమె ధరించిన లాకేట్ ఏ బ్రాండ్? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ లాకెట్ వెనుక ఉన్న అర్థం ఏమిటంటూ పలువురు స్పందించారు.ఈవిల్ ఐ లాకెట్ ,మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ బోలెడన్ని వెరైటీలు ఉండగా ఇలియానా ధరించిన లాకెట్ మాత్రం ఎంతో ప్రత్యేకంగా ఉండడంతో ప్రస్తుతం ఈమె ధరించిన లాకెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇలియానా, అభిషేక్ బచ్చన్ నటించిన ది బిగ్ బుల్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now