పెళ్ల‌య్యాక భార్య పెట్టిన టార్చ‌ర్ భ‌రించ‌లేక 21 కిలోలు త‌గ్గిన వ్య‌క్తి.. విడాకులు మంజూరు చేసిన కోర్టు..

September 9, 2021 7:29 PM

పెళ్లంటే నూరేళ్ల పంట‌. కానీ కొంద‌రి జీవితాలు మ‌ధ్య‌లోనే తెగ‌తెంపులు అవుతుంటాయి. అందుకు ఒక్కోసారి భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రో ఒక‌రు కార‌ణ‌మ‌వుతారు. కొన్ని సార్లు ఇద్ద‌రూ కార‌ణ‌మ‌వుతారు. అయితే ఆ ఇద్ద‌రి విష‌యంలో భార్య‌దే పైచేయి అయింది. కానీ ఆమె త‌న భ‌ర్త గురించి చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ త‌ప్పుడువేన‌ని తేల‌డంతో హైకోర్టు ఆ వ్య‌క్తిని నిర్దోషిగా ప్ర‌క‌టించి అత‌నికి, అత‌ని భార్యకు విడాకులను మంజూరు చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

పెళ్ల‌య్యాక భార్య పెట్టిన టార్చ‌ర్ భ‌రించ‌లేక 21 కిలోలు త‌గ్గిన వ్య‌క్తి.. విడాకులు మంజూరు చేసిన కోర్టు..

హ‌ర్యానాలోని హిసార్ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తికి, అదే ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ‌కు 2012 ఏప్రిల్ నెల‌లో వివాహం జ‌రిగింది. వారికి ఒక కుమార్తె జ‌న్మించింది. అయితే 2016వ సంవ‌త్స‌రంలో ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను విడిచిపెట్టింది. వేరేగా ఉండ‌డం మొద‌లు పెట్టింది. ఆ వ్య‌క్తి బ్యాంకు ఉద్యోగి కాగా, ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది.

అయితే ఆమె భ‌ర్త నుంచి విడిపోయాక అత‌నిపై వేధింపుల కేసు పెట్టింది. అత‌ను, అత‌ని కుటుంబ స‌భ్యులు నిత్యం త‌న‌ను వేధించే వార‌ని చెప్పింది. అయితే విచార‌ణ‌లో మాత్రం అదంతా అబ‌ద్ధ‌మ‌ని తేలింది. నిజానికి ఆమెను పెళ్ల‌య్యాక భ‌ర్తే బాగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి ఉన్న‌త చ‌దువులు చ‌దివించాడు. ఒక్క రూపాయి కూడా క‌ట్నం తీసుకోలేదు. పైగా ఆమే అత‌న్ని నిత్యం వేధించేది. కుటుంబ స‌భ్యుల ఎదుట అత‌న్ని విమ‌ర్శించేది.

ఇక భ‌ర్త నుంచి విడిపోయేట‌ప్పుడు ఆమె త‌న కుమార్తెను కూడా అత‌ని వ‌ద్దే వ‌దిలేసింది. అప్ప‌టి నుంచి త‌న కుమార్తెను చూసేందుకు ఒక్క‌సారి కూడా ఆమె ముందుకు రాలేదు. కోర్టు ఈ వివ‌రాల‌ను తెలుసుకుంది. ఇక పెళ్లి కాక ముందు తాను 74 కిలోల బ‌రువు ఉండేవాడిన‌ని, భార్య పెట్టే టార్చ‌ర్ భ‌రించ‌లేక 21 కిలోలు త‌గ్గాన‌ని, దీంతో త‌న బ‌రువు 53 కిలోల‌కు చేరుకుంద‌ని, త‌న‌పై త‌న భార్య చేస్తున్న ఆరోప‌ణ‌లు అన్నీ అబ‌ద్దాలేన‌ని అత‌ను కోర్టులో తెలిపాడు. దీంతో త‌ప్పంతా ఆమెదేన‌ని, అత‌ను నిర్దోషి అని, ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, అత‌నిపై అత‌ని భార్య చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాలేన‌ని కోర్టు తేల్చింది. దీంతో అత‌న్ని విడిచి పెట్ట‌డంతోపాటు అత‌ను ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న విధంగా అత‌నికి, అతని భార్య‌కు విడాకుల‌ను మంజూరు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now