వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేయాలో తెలుసా ?

September 9, 2021 4:25 PM

ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ రావడంతో భక్తులు వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో నైవేద్యాలు ఎంతో కీలకమైనవి. స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్దఎత్తున స్వామివారికి వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారికి కుడుములు ఎంతో ప్రీతికరం. మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా.

వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేయాలో తెలుసా ?

కావలసిన పదార్థాలు

  • శనగపప్పు – రెండు కప్పులు
  • బెల్లం – ఒకటిన్నర కప్పు
  • యాలకులు – 5
  • గోధుమపిండి – ఒక కప్పు
  • నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా శనగపప్పును కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో బెల్లం వేసి చిన్న మంటపై రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు బెల్లం, యాలకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమపిండితో ఉప్పు లేకుండా చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గోధుమపిండిని చిన్న పూరీలా తయారు చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు పూర్ణం వేసి, ఆ గోధుమ పిండి రేకులను కజ్జికాయల మాదిరిగా అల్లాలి. ఇలా చేసిన వాటిని బాగా మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారయినట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now