రూ.156కే ఎస్‌బీఐ క‌రోనా ర‌క్ష‌క్ పాల‌సీ..!

April 15, 2021 7:41 PM

కరోనా నేప‌థ్యంలో దేశంలో ఉన్న పౌరుల‌కు క‌రోనా హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించేందుకు ఇన్సూరెన్స్ సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే ఐఆర్‌డీఏఐ నుంచి అమోదం ల‌భించింది. అందులో భాగంగానే అనేక సంస్థ‌లు కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్‌నే అందిస్తోంది. ఇది త‌క్కువ కాల వ్య‌వ‌ధిని క‌లిగి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి మెడిక‌ల్ చెక‌ప్స్ అవ‌స‌రం లేకుండానే చాలా సుల‌భంగా ఈ పాల‌సీని పొంద‌వ‌చ్చు.

sbi gives corona rakshak policy for rs 156 only

కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పొందాల‌నుకునే వారి కోసం ఎస్‌బీఐ క‌రోనా ర‌క్ష‌క్ పాల‌సీని అందిస్తోంది. కేవ‌లం రూ.156 చెల్లిస్తే చాలు రూ.50వేల మొత్తానికి ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. దీనికి 105 రోజుల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. అయితే ఇంకా ఎక్కువ ప్రీమియంను చెల్లిస్తే ఎక్కువ రోజుల పాటు అధిక మొత్తంతో ఇన్సూరెన్స్‌ను పొంద‌వ‌చ్చు.

క‌నిష్టంగా రూ.50వేల నుంచి గ‌రిష్టంగా రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ పాల‌సీ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవ‌చ్చు. 105, 195, 285 రోజుల్ కాల‌వ్య‌వ‌ధితో ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. ఈ పాల‌సీ కోసం మెడిక‌ల్ టెస్టులు చేయించుకోవాల్సిన ప‌నిలేదు. ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ సైట్‌లోకి వెళ్లి అక్క‌డ ఈ పాల‌సీ పేజ్‌ను సంద‌ర్శించి అందులో వివ‌రాల‌ను న‌మోదు చేసి పేమెంట్ చేస్తే చాలు, వెంట‌నే ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. కోవిడ్ బారిన ప‌డితే హాస్పిట‌ల్‌ల‌లో చికిత్స పొందేందుకు ఈ పాల‌సీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now