వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?

September 6, 2021 9:17 PM

హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రీహరిని తులసి మాలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించరు. అంత పవిత్రమైన మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి, ఇష్టపడి తనని వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఆమె ఇష్టాన్ని వినాయకుడు కాదంటాడు.పెళ్లి చేసుకోవడం వల్ల తన తపస్సుకు భంగం కలుగుతుందని భావించిన వినాయకుడు ఆమెతో పెళ్లికి నిరాకరిస్తాడు. తనతో వివాహం కాదన్నందుకు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మధ్వజ యువరాణి వినాయకుడికి ఇష్టం లేని బలవంతమైన పెళ్లి జరుగుతుందని శాపం పెడుతుంది.

ఈ విధంగా తనకు శాపం పెట్టడంతో ఆగ్రహం చెందిన వినాయకుడు ధర్మ ధ్వజ యువరాణి పెళ్లి ఒక రాక్షసుడితో జరుగుతుందని శాపం పెడతాడు. వినాయకుడు శాపానికి ఎంతో చింతించిన యువరాణి తనకు శాపవిమోచనం కల్పించాలని కోరుతుంది. ఈ క్రమంలోనే శాంతించిన వినాయకుడు రాక్షసుడి చెంత కొంతకాలం పాటు జీవించి మరణించిన అనంతరం తిరిగి ఒక పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తావు అంటూ ఆమెకు వరమిస్తాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now