ఆధార్‌లో ఏయే మార్పులు చేస్తే ఏయే ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయో తెలుసా ?

September 5, 2021 7:13 PM

ఆధార్ కార్డులో స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు మ‌నం ప‌లు మార్పులు చేస్తుంటాం. అడ్ర‌స్‌, ఫొటో, ఫోన్ నంబ‌ర్ ఇలా ప‌లు మార్పులు చేస్తుంటాం. కొన్ని మార్పుల‌కు గాను ఆధార్ కేంద్రాల‌కు త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాలి. కానీ కొన్ని మార్పుల‌ను ఆన్‌లైన్‌లోనే చేసుకోవ‌చ్చు. అయితే ఆన్‌లైన్‌లో లేదా కేంద్రం వ‌ద్ద చేసే కొన్ని ర‌కాల ఆధార్ మార్పుల‌కు గాను వివిధ ర‌కాల ప‌త్రాలు అవ‌సరం అవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్‌లో ఏయే మార్పులు చేస్తే ఏయే ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయో తెలుసా ?

రిలేష‌న్ షిప్ ప్రూఫ్ కోసం.. ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, పెన్ష‌న్ కార్డు, పాస్‌పోర్టు, ఆర్మీ క్యాంటీన్ కార్డుల‌లో ఏదైనా ఒక దాన్ని ప్రూఫ్ కింద చూపించ‌వ‌చ్చు. పుట్టిన తేదీ ధ్రువ‌ప‌త్రం కోసం బ‌ర్త్ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు, పాన్ కార్డు, మార్క్ షీట్స్‌, ఎస్ఎస్‌సీ స‌ర్టిఫికెట్‌ల‌లో ఏదైనా ఒక దాన్ని చూపించ‌వ‌చ్చు.

ఇక ఐడీ ప్రూఫ్ కోసం అయితే.. పాస్ పోర్టు, పాన్ కార్డ్‌, రేష‌న్ కార్డు, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల‌లో దేన్న‌యినా ఒక దాన్ని చూపించ‌వ‌చ్చు.

అలాగే చిరునామా ధ్రువీక‌ర‌ణ కోసం అయితే పాస్ పోర్టు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌, పాస్ బుక్‌, రేష‌న్ కార్డు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్‌, ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌, ఎల‌క్ట్రిసిటీ బిల్‌, వాట‌ర్ బిల్లులలో దేన్న‌యినా ఒక దాన్ని చూపించ‌వ‌చ్చు.

ఇలా ఆధార్‌లో చేసే ఆయా మార్పుల‌కు అనుగుణంగా ఆయా ప‌త్రాల‌ను చూపించ‌వచ్చు. ఈ వివ‌రాల‌ను యూఐడీఏఐ తాజాగా తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఆధార్‌లో ఏయే మార్పులు చేస్తే ఏయే ప‌త్రాలు అవ‌స‌రం అవుతాయో తెలుసా ?”

  1. పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ లో ఏ ఏ మార్పులు చేయాలి.అలాగే 6 వ తరగతి బాలుడు కి స్కూల్ లో ఒక పేరు ఆధార్ లో ఒక పెరు ఉంది ఆధార్ లో పేరు మార్చాలంటే ఏ ఏ పాత్రలు కావాలి

    Reply

Leave a Comment