బర్త్‌ డే కేకులను ఐఫోన్‌తో కట్‌ చేసిన ఎమ్మెల్యే కొడుకు.. డబ్బుందనే అహంకారం.. అంటున్న నెటిజన్లు..

September 4, 2021 3:56 PM

బడాబాబులు కొందరు డబ్బుందనే అహంకారంతో ఏమైనా చేస్తారు. తాము చేసే పనులను సరైనవే అని సమర్థించుకుంటుంటారు. సమాజంలో ఇలాంటి వారు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఎమ్మెల్యే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందినవాడే. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

బర్త్‌ డే కేకులను ఐఫోన్‌తో కట్‌ చేసిన ఎమ్మెల్యే కొడుకు.. డబ్బుందనే అహంకారం.. అంటున్న నెటిజన్లు..

కర్ణాటకలోని కనకగిరి (కొప్పల్‌) ఎమ్మెల్యే బసవరాజ్‌ దడెసుగుర్‌ కుమారుడు సురేష్‌ ఇటీవలే తన బర్త్‌ డేను జరుపుకున్నాడు. అందుకు గాను అతను తన స్నేహితులను తన బీఎండబ్ల్యూ కార్‌లో అక్కడి హోసపేట్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ గ్రాండ్‌గా బర్త్‌ డేను సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

అయితే బర్త్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని కేకులను సురేష్‌ తన ఐఫోన్‌తో కట్‌ చేశాడు. ఒకదాని తరువాత ఒకటి కట్‌ చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డబ్బుందనే అహంకారంతోనే అతను ఈ విధంగా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ నాయకులు కూడా స్పందించారు.

https://twitter.com/Csoumya21/status/1433654489819410435

అసలే కోవిడ్‌ కాలం, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి సమయాల్లో వారికి సహాయం చేయాల్సింది పోయి.. డబ్బుందనే అహంకారంతో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదన్నారు. అయితే దీనిపై సదరు ఎమ్మెల్యే బసవరాజ్‌ స్పందించారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని, దాన్ని ఖర్చు పెట్టే హక్కు తన కుమారుడికి ఉందని, అందుకనే బర్త్‌ డేను అలా జరుపుకున్నాడని సమర్థించారు. అంతేకాదు, కోవిడ్‌ కనుక కత్తితో కాకుండా ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేశాడని, దీంట్లో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now