పెళ్లి చేసుకోవ‌డం.. న‌గ‌లు, న‌గ‌దుతో పారిపోవ‌డం.. 8 మందిని మోసం చేసిన మ‌హిళ‌.. చివ‌ర‌కు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్దార‌ణ‌..

September 3, 2021 12:56 PM

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ ఏకంగా 8 మంది పురుషుల‌ను పెళ్లి పేరిట మోసం చేసింది. అయితే చివ‌ర‌కు పోలీసులు ఆమెను అరెస్టు చేయ‌గలిగారు. కానీ షాకింగ్ విష‌యం తెలిసింది. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న‌ట్లు నిర్దారించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుని మోస‌పోయిన పురుషుల ప‌రిస్థితి దారుణంగా మారింది.

పెళ్లి చేసుకోవ‌డం.. న‌గ‌లు, న‌గ‌దుతో పారిపోవ‌డం.. 8 మందిని మోసం చేసిన మ‌హిళ‌.. చివ‌ర‌కు హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్దార‌ణ‌..

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ (30)కు పెళ్ల‌యింది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన భ‌ర్త ఆమెను వ‌దిలేశాడు. ఇది నాలుగేళ్ల కింద‌ట జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎలాగైనా డ‌బ్బు సంపాదించాల‌ని చెప్పి పురుషుల‌ను ప్రేమ‌, పెళ్లి పేరిట మోసం చేయ‌డం ప్రారంభించింది.

గ‌త 4 ఏళ్లుగా ఆమె అలా 8 మంది పురుషుల‌ను మోసం చేసింది. ముందుగా ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. పెళ్లి చేసుకుందాం అంటుంది. తీరా పెళ్ల‌య్యాక 10-15 రోజులు ఉండి కుటుంబ స‌భ్యుల‌కు మ‌త్తు మందు పెట్టి వారు మ‌త్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న న‌గ‌లు, న‌గ‌దుతో ఉడాయిస్తుంది. ఈ విధంగా ఆమె 8 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. దీంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ఆమె కోసం గాలించారు.

అయితే ఎట్ట‌కేల‌కు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచేముందు వైద్య పరీక్ష‌లు చేయ‌గా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ (ఎయిడ్స్)  ఉన్న‌ట్లు నిర్దారణ అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న 8 మంది పురుషుల‌కు పోలీసుల‌కు సూచ‌న‌లు పంపారు. వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. దీంతో వారు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment