జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్లాన్ల‌తో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..!

September 1, 2021 5:35 PM

టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను బండిల్‌గా క‌లిగిన కొత్త ప్లాన్ల‌ను జియో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ల‌ను రీచార్జి చేసుకుంటే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఎప్పటికీ అలాగే కొన‌సాగాలంటే ఆ ప్లాన్ల‌ను గ‌డువు తీరిన‌కొద్దీ రీచార్జి చేస్తూ ఉండాలి. దీంతో ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త ప్లాన్ల‌తో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..!

ఇక ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను పొందేందుకు గాను జియో ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు రూ.499, రూ.666, రూ.888, రూ.2599, రూ.549 ల‌లో ఏదైనా ఒక ప్లాన్ ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని జియో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టింది.

రూ.499 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, ఉచిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే రూ.666 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. ఉచిత కాల్స్, మెసేజ్ లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది.

రూ.888 ప్లాన్ లో రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఉచిత కాల్స్, మెసేజ్ లు వ‌స్తాయి. దీని వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.2599 తో రీచార్జి చేస్తే రోజుకు 2జీబీ డేటా, ఉచిత కాల్స్, మెసేజ్ లు వ‌స్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఇక వీటితోపాటు డేటా యాడాన్ వేసుకోవ‌చ్చు. దాని విలువ రూ.549. రోజుకు 1.5 జీబీ డేటా వ‌స్తుంది. దీంట్లో ఉచిత కాల్స్, మెసేజ్ లు రావు. వాలిడిటీని 56 రోజులుగా నిర్ణ‌యించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment