గొర్రె పొట్టేళ్ల పెంప‌కం.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..

September 1, 2021 3:45 PM

స‌రిగ్గా మ‌న‌స్సు పెట్టి ఆలోచించాలే గానీ చేసేందుకు స్వ‌యం ఉపాధి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో గొర్రె పొట్టేళ్ల పెంప‌కం కూడా ఒక‌టి. కొద్దిగా శ్ర‌మ ప‌డాలే గానీ ఓపిక‌తో అమ్మితే గొర్రె పొట్టేళ్ల‌ను అమ్మ‌డం ద్వారా ల‌క్ష‌ల రూపాయల ఆదాయం పొంద‌వ‌చ్చు.

గొర్రె పొట్టేళ్ల పెంప‌కం.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..

గొర్రె పొట్టేళ్ల‌ను పెంచేందుకు చ‌క్క‌ని స్థలం ఉండాలి. అందులో గ‌డ్డి పెంచితే మేలు. దాణాను బ‌య‌ట కొన‌వ‌చ్చు. మొక్క జొన్న పిండి, ప‌ల్లి చెక్క‌, బియ్యం పొడి వంటి వాటిని దాణాగా వేయ‌వ‌చ్చు. అలాగే గొర్రెల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు టీకాల‌ను కూడా వేయిస్తుండాలి. దీంతో అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.

1000 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఉంటే అందులో చిన్న షెడ్డు వేసి 40 గొర్రెల‌ను పెంచ‌వ‌చ్చు. షెడ్డు నిర్మాణానికి సుమారుగా రూ.70వేల వ‌ర‌కు అవుతుంది. 3-4 నెల‌ల వ‌య‌స్సు ఉన్న గొర్రె పిల్ల ఒక్క‌టి రూ.5500 వ‌ర‌కు ధ‌ర ఉంటుంది. దాన్ని సుమారుగా 4 నెల‌ల పాటు పెంచాలి. అప్పుడు దాని ధ‌ర రూ.9000 వ‌ర‌కు ప‌లుకుతుంది.

గొర్రె పొట్టేళ్ల పెంప‌కం.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..

గొర్రె పిల్ల మొద‌ట్లో కొన్న‌ప్పుడు సుమారుగా 15 కిలోల బ‌రువు ఉంటుంది. 4 నెల‌లు పెంచితే 26 నుంచి 30 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి. త‌రువాత పెరుగుద‌ల నెమ్మ‌దిగా ఉంటుంది. క‌నుక అప్పుడు అమ్మేయాలి. ఈ క్ర‌మంలో ఒక బ్యాచ్‌కు 40 గొర్రెల‌ను పెంచితే వాటిని ఒక్కొక్క‌టి రూ.9000 కు అమ్మినా .. రూ.3.60 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఈ విధంగా గొర్రె పొట్టేళ్ల‌ను అమ్మి చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now