ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి పరీక్ష లేకుండా..

September 1, 2021 6:45 PM

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఖాళీలన్నింటిని జిల్లాల వారీగా భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలో ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే పారామెడికల్, ఆప్తాలీక్ అసిస్టెంట్‌ విభాగాలలో ఖాళీగా ఉన్న 21 పోస్టులను భర్తీ చేయడానికి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకి అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.

ఈ ఇంటర్వ్యూ లకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపిసి చేసి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన  పారా మెడికల్, ఆప్తాలీక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ (ఆప్టోమెట్రీ) లేదా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. లేదా ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పారా మెడికల్ బోర్డు లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 2020 డిసెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. కాంట్రాక్ట్ విధానంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now