వీడియో వైరల్: మొబైల్ ఫోన్ ఎత్తుకుపోయిన చిలుక.. చివరికి ఏం జరిగిందంటే ?

August 28, 2021 9:31 PM

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో రకాల అరుదైన, ఆశ్చర్యం కలిగించే సంఘటనలకు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో ఇలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పక్షులు చేసే చిలిపి చేష్టలు, విచిత్రమైన శబ్దాలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా ట్విట్టర్ యూజర్ fred035schultz అలాంటి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒక చిలుక మొబైల్ ఫోన్ దొంగలించినట్టు ఉంది. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక కుర్రాడు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిలుక వైపు చూసేసరికి ఆ చిలుక మొబైల్ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఆ చిలుక ఎంతో దూరం ప్రయాణిస్తూ చివరికి ఒక కారుపై వాలడంతో ఈ వీడియో ముగిసింది.

అయితే ఈ వీడియోలో మాత్రం ఎక్కడా చిలుకను కానీ అది ఫోన్ తీసుకెళ్తున్నట్టు కానీ చూపించక పోవడంతో ఇది రియల్ గా తీసినదా లేక గ్రాఫిక్స్ క్రియేట్ చేశారా అనే సందేహం కలుగుతోంది. ట్విట్టర్ వేదికగా ఈ వీడియోని షేర్ చేస్తూ.. మొబైల్ ఎత్తుకెళ్లిన చిలక.. ట్రిప్ అదిరిపోయింది అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్పందిస్తూ మొబైల్ ఫోన్ ఎలా దొరికింది.. ఈ వీడియో క్లిప్ ఎలా వచ్చింది అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/fred035schultz/status/1430231941283041288

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now