శ్రీకృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి.. పూజా విధానం ఏమిటి ?

August 27, 2021 9:11 PM

శ్రీ కృష్ణాష్టమి పండగను ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఆ రోజు ఇంట్లో చిన్నపిల్లలను శ్రీ కృష్ణుడిలా, గోపికలలా తయారుచేసి బాగా సందడిగా జరుపుకుంటారు. తమ చిన్ని శ్రీకృష్ణులతో తమ ఇల్లు మొత్తం అడుగులతో నింపుతారు. ఇక ఈ పండుగను శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని పిలుస్తుంటారు. ఈ పండుగ రోజు ఉదయాన్నే స్నానమాచరించి షోడశోపచారాలతో కృష్ణుడికి పూజలు చేస్తారు.

ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమకూర్చుతారు. ఇంటిని మామిడాకు తోరణాలతో, పువ్వులతో అలంకరిస్తారు. శ్రీ కృష్ణ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి కొత్త వస్త్రాలను ధరిస్తారు. పువ్వులతో, ధూప దీపాలతో, నైవేద్యాలతో ఆయనకు పూజలు చేస్తారు. పూజ చేసే సమయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుడిపై మనసును నిమగ్నం చేయాలి.

కృష్ణుని తలుచుకొని అర్చిస్తే పాపాలు పోతాయి. బంగారం లేదా వెండితో లేదా చంద్రబింబాన్ని తయారుచేసి వెండి లేదా బంగారు పాత్రలో ఉంచి పూజ చేస్తే కోరికలు తీరుతాయి. సకల పాపాలు తొలగుతాయి. సంతానం లేనివారు సంతాన గోపాల మంత్రంతో కృష్ణుని పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుంది. ఇక పెళ్ళి కాని వారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేసినట్లైతే పెళ్లి జరుగుతుంది. ఇక ముఖ్యంగా గోవులకు ఆహారం పెడితే ప్రతి  దేవుడి ఆశీస్సులు ఉంటాయి.  ఆ రోజు భక్తులు కృష్ణుడికి ఇష్టమైన ఆట ఉట్టి కొట్టడం వంటి సంబరాలు కూడా చేసుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now