దారుణం.. మృత దేహాన్ని తలకిందులుగా వేలాడదీసిన గ్రామస్థులు..

August 27, 2021 2:36 PM

ఎక్కడైనా మృతదేహాన్ని పూడ్చడం లేదా దహనం చేస్తుంటారు. కానీ ఓ చోట మృతదేహాన్ని దారుణంగా తలకిందులుగా వేలాడదీశారు. ఇంతకీ అలా ఎందుకు చేశారంటే.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జోగిపుర గ్రామానికి చెందిన భన్వర్ లాల్ బంజారా అనే వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్లడంతో ప్రమాదవశాత్తూ మరణించాడు. దీంతో ఈ విషయం పోలీసులకు, అక్కడున్న గ్రామస్తులకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు.

 కొందరు అతడి మృతదేహాన్ని బయటకు తీసి దాన్ని ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీశారు. అలా చేయడం వల్ల నీరు బయటికి వస్తుందని దాంతో బతికే అవకాశం ఉండవచ్చని గ్రామస్తులు తెలియజేయడంతో అక్కడున్న పోలీసులు కూడా గ్రామస్థుల మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అలా 30 నిమిషాల పాటు మృతదేహాన్ని ఉంచి ఊపారు. ఎటువంటి ఫలితం లేకపోయే సరికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు.

ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అక్కడున్న వారందరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. అక్కడున్న కొందరు పోలీసులు కూడా ఈ ఘటన పట్ల స్పందించకపోయేసరికి వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీస్ అవుట్ పోస్ట్ ఇంచార్జ్ స్సందిస్తూ ఆ గ్రామస్తులు తాను ఎంత చెప్పినా వినలేదని.. అతడు బతుకుతాడని అలా చేశారని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment