అద్భుతం.. ఆవులాగే పాలిస్తున్న దూడ‌.. తండోప తండాలుగా వ‌చ్చి చూస్తున్న జ‌నం..

August 24, 2021 6:12 PM

అద్భుతాలు అనేవి ఎక్క‌డో అరుదుగా జ‌రుగుతుంటాయి. అలా జ‌రిగిన‌ప్పుడు వాటిని చూసేందుకు జ‌నాలు తండోప తండాలుగా వ‌స్తుంటారు. గుజ‌రాత్‌లోని భుజ్‌లోనూ స‌రిగ్గా ఇలాగే ఓ అద్భుతం చోటు చేసుకుంది. 9 నెల‌ల వ‌య‌స్సు ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దీంతో దాన్ని చూసేందుకు జ‌నాలు పోటీ ప‌డుతున్నారు.

అద్భుతం.. ఆవులాగే పాలిస్తున్న దూడ‌.. తండోప తండాలుగా వ‌చ్చి చూస్తున్న జ‌నం..

గుజ‌రాత్‌లో ఉన్న భుజ్ ప్రాంతంలో ర‌షీద్ సామా అనే వ్య‌క్తి 25 ఆవుల‌ను పెంచుతున్నాడు. ఆవు పాల‌ను విక్ర‌యిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అత‌ని వ‌ద్ద ఉన్న ఓ ఆవు దూడ పాలిస్తోంది. దాని వ‌య‌స్సు 9 నెల‌లు.

సాధార‌ణంగా ఆవు దూడ పుట్టాక 4 ఏళ్ల‌కు పెద్ద‌దై దూడ‌ల‌కు జ‌న్మ‌నిస్తుంది. దూడ పుట్టాక ఆవు ఏడాది వ‌ర‌కు పాలిస్తుంది. అయితే ఆ ఆవు దూడ వ‌య‌స్సు 9 నెల‌లే అయిన‌ప్ప‌టికీ పాలిస్తుండ‌డం విశేషం. ఆ దూడ రోజుకు 1-2 గిన్నెల నిండా పాలిస్తుంద‌ని ర‌షీద్ చెబుతున్నాడు. దీంతో ఆ దూడ‌ను చూసేందుకు చుట్టు ప‌క్క‌ల వారు పెద్ద ఎత్తున అక్క‌డికి వ‌స్తున్నారు.

అయితే ఆ దూడ‌ను కొంటామ‌ని, దానికి రూ.55వేల నుంచి రూ.70వేల వ‌ర‌కు ఇస్తామ‌ని కొంద‌రు ముందుకు వ‌స్తున్నారు. అయితే దాన్ని అమ్మ‌బోన‌ని ర‌షీద్ తెలిపాడు. ఏది ఏమైనా ఈ విష‌యం వెట‌ర్న‌రీ వైద్య నిపుణుల‌కు కూడా అంతుబ‌ట్ట‌టం లేదు. దూడ ఎందుకు పాలు ఇస్తుందో వారు కూడా చెప్ప‌లేక‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now