నిరుద్యోగులకు శుభవార్త.. కోల్ ఇండియాలో 588 ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ..!

August 23, 2021 9:23 PM

భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న సంస్థ కోల్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను తెలియజేసింది. వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న 588 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక గేట్ స్కోరు ఆధారంగా జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి ఈ వెబ్‌సైట్‌ ద్వారానే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.coalindia.in/ . ఎలక్ట్రికల్ విభాగంలో 117, మెకానికల్ విభాగంలో 134, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 15, జియాలజీ విభాగంలో 12, సివిల్ 57 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ ను బట్టి వివిధ విద్యార్హతలు ఉన్నాయి. 2021 ఆగస్టు 4వ తేదీకి 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కోల్ ఇండియా అభ్యర్థులు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు 1000 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 9వ తేదీని దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment