హిజ్రా అందానికి ఫిదా అయిన యువకుడు.. నాలుగేళ్ళు సహజీవనం చేసి చివరికి ఇలా..!

August 21, 2021 10:16 PM

ఆమె ఒక హిజ్రా.. అయితే ఆమె ఎంతో అందంగా ఉండడంతో ఆమె అందాన్ని చూసి ఓ యువకుడు ప్రేమలో పడిపోయాడు. ఎలాగైనా తనతో కలిసి జీవితం పంచుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయం ఆమెకు చెప్పడంతో మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తాను ఒక హిజ్రా అని  ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతున్నాననే విషయం తెలియ జేసింది. అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ యువకుడు చెప్పడంతో అతనిలోని నిజాయితీ నచ్చి ఆమె తన ప్రేమకు అంగీకరించింది. అయితే నాలుగు సంవత్సరాలపాటు తనతో సహజీవనం చేసిన ఆ యువకుడు ఆమెను దారుణంగా చంపాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

అఫ్జల్‌గఢ్‌కు చెందిన అజీమ్‌ అనే హిజ్రాతో షాదాబ్ అనే యువకుడు గత నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఎంతో హాయిగా సాగిపోయింది. ఇటీవలే వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయి.

ఈ క్రమంలో షాదాబ్ శుక్రవారం ఉదయం ఈ విషయం గురించి అజీమ్‌ తో రూ.15 లక్షలకు సంబంధించిన విషయం గురించి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి గురైన షాదాబ్ తుపాకీతో అజీమ్‌ ను కాల్చి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ సంఘటనను తాను పెంచుకుంటున్న దత్తపుత్రిక చూడటంతో పోలీసులకు ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న షాదాబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now