ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఈ నెలలోనే గ్రూప్ 1, 2 పరీక్షలకు నోటిఫికేషన్..

August 21, 2021 10:11 PM

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని సీఎం జగన్ గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే గత నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో గ్రూప్ -1, గ్రూప్ -2కు సంబంధించిన పోస్టులు ఖాళీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒక వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయగా అందులో గ్రూప్-1 పోస్టులు 31 ఖాళీ ఉండగా, గ్రూప్ -2 పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి.ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖాళీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

కేవలం ఖాళీల సంఖ్యను పెంచడమే కాకుండా అభ్యర్థుల వయసు పరిమితి కూడా పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొంది.

గ్రూప్-1 విభాగంలో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులు

  • బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-2
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్)-7
  • డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్-1
  • డిస్ట్రిక్ట్ రిజిస్టార్/అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ జనరల్-2
  • రీజినల్ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్-2
  • జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2
  • వైద్య ఆరోగ్య శాఖలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు 15
  • గ్రూప్ -2 ఈ విభాగంలో 5 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now