వాహ‌నాన్ని ట్రాఫిక్ వ్యాన్ మీద‌కు ఎక్కిస్తున్నా దాని మీదే కూర్చున్న వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

August 21, 2021 12:27 PM

ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి వాహ‌నాల‌ను న‌డ‌పాల్సి ఉంటుంది. అలాగే వాహ‌నాల పార్కింగ్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు వహించాలి. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ఫైన్ వేస్తారో తెలియ‌దు. ఎప్పుడు వాహ‌నాల‌ను టోయింగ్ చేసి తీసుకెళ్తారో తెలియదు. ఆ వ్య‌క్తికి కూడా అలాగే జ‌రిగింది. కానీ అక్క‌డే వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

వాహ‌నాన్ని ట్రాఫిక్ వ్యాన్ మీద‌కు ఎక్కిస్తున్నా దాని మీదే కూర్చున్న వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

పూణెలోని నానాపేట్ ఏరియాలో నో పార్కింగ్ ప్లేస్‌లో వాహ‌నాల‌ను పార్కింగ్ చేసిన వారిపై అక్క‌డి స‌మ‌ర్థ్ ట్రాఫిక్ బ్రాంచ్ పోలీసులు కొర‌డా ఝులిపించారు. వాహ‌నాల‌ను అన్నింటినీ టోయింగ్ చేసి తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ వ్యాన్‌పైకి ఎక్కించారు. అయితే వాటిల్లో ఓ టూవీల‌ర్‌కు చెందిన వ్య‌క్తి త‌న వాహనాన్ని పోలీసులు తీసుకెళ్తుండ‌డం చూసి భ‌రించలేక ఏకంగా వ్యాన్ మీద‌కు ఎక్కాడు.

వ్యాన్ మీద‌కు అప్ప‌టికే ఎక్కించిన త‌న టూవీల‌ర్‌పై అత‌ను కూర్చుని చాలా సేపు కింద‌కు దిగ‌లేదు. పోలీసులు ఎన్నో సార్లు అత‌నికి కింద‌కు దిగాల‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను కింద‌కు రాలేదు. ఇక కొంత సేప‌టి త‌రువాత అత‌ను మ‌న‌సు మార్చుకుని కింద‌కు దిగి ఫైన్ క‌ట్టాడు. వాహ‌నాన్ని అత‌నికి పోలీసులు అప్ప‌గించారు. అత‌ను క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now