సంతోషంగా దండలు మార్చుకుంటున్న వధూవరులు.. కన్నీళ్లు పెడుతున్న వధువు తల్లి.. వీడియో వైరల్..

August 20, 2021 4:12 PM

సాధారణంగా కొన్ని పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారుతుంటాయి. అయితే ఆ పెళ్ళిలో జరిగిన హాస్యాస్పద సంఘటనలు లేదా భావోద్వేగ ఘటనల వల్ల ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఇది వరకు ఇలాంటి వీడియోలు ఎన్నో మనం చూసే ఉన్నాం. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంతోషంగా దండలు మార్చుకుంటున్న వధూవరులు.. కన్నీళ్లు పెడుతున్న వధువు తల్లి.. వీడియో వైరల్..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా sanskritishankar అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో తన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతున్నప్పటికీ తల్లి మాత్రం ఎంతో భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. కూతురు తనకు కాబోయే భర్త పెళ్లి మండపంలో ఎంతో సంతోషంగా ఉండి ఇరువురు దండలు మార్చుకుంటూ ఉండగా వధువు తల్లి మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురైంది.

https://www.instagram.com/reel/CSPVIsSD82P/?utm_source=ig_web_button_share_sheet

తన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతున్నప్పటికీ తను మాత్రం తనకంటే వయసులో ఎంతో పెద్దవాడిని పెళ్లి చేసుకుంటుందన్న బాధలో తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now