SBI ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా.. ఇలా చేయండి!

August 18, 2021 10:26 PM

మీరు SBI కస్టమరా.. SBI ఏటీఎం కార్డు వాడుతూ ఏటీఎం పిన్ మర్చిపోయారా.. లేకపోతే కొత్త ఏటీఎం కార్డుకు పిన్ జనరేట్ చేసుకోవాలా? అయితే ఇలా కొత్త పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. అది ఎంతో సులభతరం అయిన ప్రక్రియ. ఒకప్పుడు పిన్ కోడ్ పోస్ట్ ద్వారా మన ఇంటికి వచ్చేది. ఒకవేళ పిన్ మర్చిపోతే మళ్లీ బ్యాంకుకి వెళ్లి పిన్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ పిన్ ను ఇంట్లోనే ఆన్‌లైన్‌ ద్వారా ఎంతో సులభంగా పొందవచ్చు. ఎలాగంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు ఇంటరాక్టివ్‌ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్-IVRS ద్వారా తమ ఏటీఎం పిన్ కోడ్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి పిన్ ను జనరేట్ చేసుకోవడానికి కస్టమర్లు తప్పనిసరిగా బ్యాంకులో ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ ఫోన్ నంబర్ నుంచి 1800 112 211 లేదా 1800 425 3800 అనే నంబర్‌లకు కాల్ చేసి అందులో ఆప్షన్ లను ఎంచుకోవడం ద్వారా పిన్ నంబర్ జనరేట్ అవుతుంది.

ఈ నంబర్లకు ఫోన్ చేసే కన్నా ముందుగా మన ఏటీఎం కార్డు నంబర్, అకౌంట్ నంబర్ దగ్గర ఉంచుకోవాలి. ఈ నంబర్లకు ఫోన్ చేయగానే ముందుగా భాషను ఎంచుకుని డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం సర్వీసుల కోసం 2 నొక్కాలి. ఆ తరువాత ఏటీఎం పిన్ జనరేట్ చేయడం కోసం 1ని నొక్కాలి. ఈ విధంగా ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఎంతో సులభంగా మనం ఏటీఎం పిన్ ను జనరేట్ చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now