మ‌రో రెండు రోజుల పాటు తెలంగాణ‌లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు.. కొన్ని చోట్ల అతి భారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చ‌రిక‌..

August 18, 2021 1:14 PM

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డ‌నున్నాయ‌ని, కొన్ని చోట్ల అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఇండియ‌న్ మెటెరొలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు ఐఎండీ హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ కె.నాగ‌ర‌త్నం మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

మ‌రో రెండు రోజుల పాటు తెలంగాణ‌లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు.. కొన్ని చోట్ల అతి భారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చ‌రిక‌..

రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, ఖ‌మ్మం, నిర్మ‌ల్‌, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక‌పాటి లేదా ఒక మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌, కొమ‌రం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, న‌ల్గొండ‌, సిద్దిపేట‌, మెద‌క్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని అన్నారు.

అదేవిధంగా రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ (రూర‌ల్‌), వ‌రంగ‌ల్ (అర్బ‌న్), జ‌న‌గాం, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, కామారెడ్డి, నాగ‌ర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని అన్నారు.

హైద‌రాబాద్‌లో ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని, కొన్ని చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని అన్నారు. ఆగ‌స్టు 19, 20 తేదీల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment