డిగ్రీ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరి తేదీ!

August 18, 2021 4:40 PM

డిగ్రీ పాసైన విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇండియన్ ఆర్మీలోని టెరిటోరియల్ ఆర్మీలో ఈ పోస్టులున్నాయని, ఈ పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి జులై 20న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 19 వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలోనే ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వీరు వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వందల రూపాయల పరీక్ష రుసుము చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది.

https://www.jointerritorialarmy.gov.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now