వాహ్‌.. చిత్తు కాగితాలు ఏరుకునే మ‌హిళ‌.. ధారాళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతోంది.. వీడియో..!

August 17, 2021 9:25 PM

టాలెంట్ అనేది ఎవ‌రి సొత్తు కాదు. ఎవ‌రు ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నా త‌మ టాలెంట్‌ను మాత్రం కోల్పోరు. అలాంటి వారి గురించి సోష‌ల్ మీడియా ఎప్పుడూ హైలైట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి వారు రాత్రికి రాత్రే పాపుల‌ర్ అయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ మ‌హిళ పాపుల‌ర్ కాలేదు. కానీ త‌న ఇంగ్లిష్ వాగ్ధాటితో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

వాహ్‌.. చిత్తు కాగితాలు ఏరుకునే మ‌హిళ‌.. ధారాళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతోంది.. వీడియో..!

బెంగ‌ళూరుకు చెందిన సెసిలియా మార్గ‌రెట్ లారెన్స్ అనే మ‌హిళ ఒక‌ప్పుడు బాగానే బ‌తికింది. కానీ ఏ క‌ష్టం వ‌చ్చిందో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి అత్యంత ద‌యనీయంగా మారింది. ర‌హ‌దారుల‌పై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవ‌నం సాగిస్తోంది. చూస్తుంటే మ‌తి స్థిమితం లేని మ‌హిళ‌గా కూడా క‌నిపిస్తుంది.

https://www.instagram.com/reel/CSa4Sf3nZoZ/?utm_source=ig_embed&ig_rid=ffbfe830-a440-4de7-b668-19ed57d1a566

అయితే మార్గ‌రెట్ నిజానికి ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడ‌గ‌ల‌దు. ఆమె కొంత కాలం జ‌పాన్‌లో ఉంది. ఆమె ఆ విష‌యాన్ని ఇంకో వీడియోలో స్వ‌యంగా వెల్ల‌డించింది. ఆమె ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్న‌ప్పుడు తీసిన ఆ రెండు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/CSazoZ8HelD/?utm_source=ig_embed&ig_rid=818e14ce-8f80-4ef7-b175-c18b51f273cc

చాలా మంది మార్గ‌రెట్ గురించి ఎంక్వ‌యిరీ చేస్తున్నారు. ఆమె గురించి చెప్పండి స‌హాయం చేస్తాం.. అని ముందుకు వ‌స్తున్నారు. మ‌రి ఆమెకు స‌హాయం అందుతుందా, లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment