ఇసుకేస్తే రాల‌న‌ట్లు.. 640 మంది ఆఫ్గ‌న్లు ఒకే విమానంలో.. ఫొటోలు వైర‌ల్‌..

August 17, 2021 5:41 PM

ఆప్గ‌నిస్థాన్‌లో ప్ర‌స్తుతం హృద‌య విదార‌క‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం విదిత‌మే. తాలిబ‌న్ల చేతుల్లో బ‌లి అవ‌కుండా ఉండేందుకు గాను ఆఫ్గ‌నిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్ర‌మంలోనే విమానాల్లో తీవ్ర‌మైన ర‌ద్దీ నెల‌కొంది. కాగా ఆప్గ‌న్ పౌరుల‌ను ఖ‌తార్ పంపేందుకు వ‌చ్చిన ఓ అమెరిక‌న్ విమానంలో ఏకంగా 640 మంది ప్ర‌యాణించారు. విమానంలో కిందే కూర్చుని ఆఫ్గ‌నిస్థాన్ నుంచి బ‌య‌ల్దేరి వెళ్లిపోయారు.

ఇసుకేస్తే రాల‌న‌ట్లు.. 640 మంది ఆఫ్గ‌న్లు ఒకే విమానంలో.. ఫొటోలు వైర‌ల్‌..

కాబూల్ నుంచి ఖ‌తార్‌కు అమెరికాకు చెందిన బోయింగ్ సి-17 విమానం బ‌య‌ల్దేరింది. అందులో సాధార‌ణంగా అయితే 134 మంది మాత్ర‌మే ప్ర‌యాణించేందుకు వీలుంటుంది. కానీ ఆ విమానంలో ఏకంగా 640 మంది వెళ్లారు. ఈ క్ర‌మంలో వారు విమానంలో కింద కూర్చుని ఇసుక వేస్తే రాల‌న‌ట్లు ఉండి ప్ర‌యాణం చేశారు. చివ‌ర‌కు ఖ‌తార్ చేరుకున్నారు.

ఆఫ్గ‌నిస్థాన్‌లో రోజు రోజుకీ ప‌రిస్థితులు దిగ‌జారిపోతుండ‌డంతో పౌరులు విమానాల్లో ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ప‌లు దేశాల‌కు చెందిన విమానాల్లో వారు ప్ర‌యాణం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now