రూ.15 ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని బీజేపీకి ద‌ర‌ఖాస్తు చేయండి.. ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి..

August 17, 2021 2:45 PM

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార‌, విప‌క్ష పార్టీలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం కేసీఆర్ హుజారాబాద్‌లో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించారు. 1-2 నెల‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుంద‌రికీ కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. 4 ఏళ్ల‌లో రాష్ట్రంలోని 17 ల‌క్ష‌ల‌కు పైగా ద‌ళిత కుటుంబాల‌కు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి చేకూరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

రూ.15 ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని బీజేపీకి ద‌ర‌ఖాస్తు చేయండి.. ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి..

అయితే తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తుంద‌ని, ప‌థ‌కాల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ తాజాగా ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందేందుకు త‌మ‌కు ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయాల‌ని, వాటిని ప్ర‌భుత్వానికి తాము అంద‌జేస్తామ‌ని ఆయన తెలిపారు. ఈ క్ర‌మంలోనే బండి సంజ‌య్ ట్వీట్ కూడా చేశారు.

అయితే ఆ ట్వీట్‌కు రాష్ట్ర మంత్రి, తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంట‌ర్ వేశారు. ప్ర‌ధాని మోదీ దేశంలోని అర్హులైన ప్ర‌జలంద‌రి అకౌంట్ల‌లో రూ.15 ల‌క్ష‌ల చొప్పున వేస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చార‌ని, కానీ ఆ వాగ్దానాన్ని నెర‌వేర్చ‌లేద‌ని, క‌నుక ప్ర‌జ‌లు రూ.15 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరుతూ బీజేపీకి అప్లికేష‌న్ల‌ను ఇవ్వాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now