శ్రావణ మంగళవారం.. మంగళ గౌరీ వ్రత విధానం!

August 16, 2021 11:16 AM

హిందువులకు ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో మహిళలు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వచ్చే మంగళవారం, శుక్రవారాలలో అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మంగళగౌరీ వ్రతం అనగా సాక్షాత్తు ఆ పార్వతీదేవికి పూజ చేయడమే.ఈ విధంగా పార్వతీదేవికి పూజ చేయడం వల్ల మహిళలు తమ మాంగల్య బలం పది కాలాలపాటు చల్లగా ఉంటుందని విశ్వసిస్తారు. మరి ఈ పూజ ఎలా చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మంగళవారాలలో చేస్తారు. ఈ వ్రతం చేసే వారు ఉపవాస దీక్షలతో వ్రతం ఆచరించాలి. కొత్తగా పెళ్లయిన వధువు చేత ఈ వ్రతం ఆచరించడం వల్ల తన వైవాహిక జీవితం పది కాలాలపాటు చల్లగా ఉంటుందని భావిస్తారు.ఈ క్రమంలోనే నూతన వధువు చేత మంగళ గౌరీ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా పుట్టింటిలో నిర్వహించాలి. మిగిలిన నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో ఈ వ్రతం చేయాలి.

ఈ వ్రతం చేసేటప్పుడు వ్రతం చేసే వారి తల్లి తన పక్కనే ఉండి తన కూతురు వ్రతం చేయించాలి. ఒకవేళ తల్లి లేని పక్షంలో అత్త కూర్చోవాలి. ఈ విధంగా పూజ అనంతరం మొదటి వాయనం తల్లికి సమర్పించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. అలాగే ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి మంగళప్రదమైన వస్తువులను తాంబూలంలో పెట్టి వాయనంగా ఇవ్వడం వల్ల తను దీర్ఘసుమంగళీగా ఉంటుందని భావిస్తారు. ఈ విధంగా నెల మొత్తం ఒకే విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలి.ఈ విగ్రహాన్ని వినాయక చవితి తరువాత వినాయకుడికి నిమజ్జనం చేసేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా నీటిలో నిమజ్జనం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment