సమంత సంపాద‌న‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు పెడితే అంత మొత్త‌మా ?

August 12, 2021 9:43 PM

స్టార్ న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న స‌మంత గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన శైలిలో న‌ట‌న‌తో ఆమె అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆమె న‌టించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

సమంత సంపాద‌న‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు పెడితే అంత మొత్త‌మా ?

ఏ మాయ చేశావే మూవీతో స‌మంత సినీ తెర‌పై ప్ర‌వేశం చేయ‌గా ఇప్ప‌టికి న‌టిగా 10 ఏళ్ల కెరీర్ ముగిసింది. ఇప్ప‌టికీ స్టార్ న‌టిగా కొన‌సాగుతోంది. సినిమాలూ, టీవీ షోలు, సిరీస్‌ల‌లో న‌టిస్తూ అల‌రిస్తోంది. మ‌రో వైపు వ్యాపార‌వేత్త‌గా కూడా సక్సెస్ అయింది.

అయితే త‌న మూవీల‌కు చెందిన వివ‌రాల‌తోపాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మంత త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది. అందుకు సోష‌ల్ మీడియాను ఆమె ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఆమెకు ఏకంగా 18 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక్క పోస్టు పెడితే రూ.25 ల‌క్ష‌ల నుంచి రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలిసింది. దీంతోపాటు టీవీ యాడ్స్‌లోనూ న‌టిస్తూ రూ.ల‌క్ష‌ల్లో రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు స‌మాచారం. కాగా స‌మంత ప్ర‌స్తుతం శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండ‌గా దిల్ రాజు, నీలిమా గుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now